I Feel You: ఎలిమెంటరీ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుండగనే సినీ నేపథ్య గాయనిగా మారి సంచలనం సృష్టించిన స్పూర్తి జితేందర్… ఇప్పటివరకు సుమారు 80 చిత్రాల్లో 100కు పైగా పాటలతో అలరించింది. పదుల సంఖ్యలో మిలియన్ల కొద్దీ వ్యూస్ కలిగిన పాటలు తన ఖాతాలో కలిగి ఉండడం ఈ మధుర గాయని ప్రత్యేకత! ప్రపంచ ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి వెస్టర్న్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకున్న స్పూర్తి తాజాగా ‘ఐ ఫీల్ యు’ అనే ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ చేశారు. తనే స్వయంగా రాసి, పాడి, నటించిన ఈ ఆల్బమ్ న్యూయార్క్, న్యూజెర్సీలలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఈ ప్యూర్ లవ్ సాంగ్ పోస్టర్ ను ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, సంచలన గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించి స్పూర్తికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సంగీతంలో ఆస్కార్ అవార్డ్ లాంటి గ్రామీ అవార్డ్ సాధించి మన దేశం గర్వపడేలా చేయడం తన లక్ష్యంగా నిర్దేశించుకున్న స్పూర్తి… తన మొట్ట మొదటి ఇంగ్లీష్ ఆల్బమ్ పోస్టర్ లాంచ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ లకు ఎప్పటికీ కృతాజ్ఞురాలినై ఉంటానని అన్నారు. మదీన్ ఎస్.కె. సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ ను ప్రవాస భారతీయులు రాహుల్ సి.హెచ్., తేజస్వి వైష్ణవ తమ మిత్ర బృందంతో కలిసి నిర్మించారు.