Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సాధించి విజయ్ CMపైగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ గెలుపుపట్ల తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ను ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దాంతో విజయ్ సీఎం అవడం రజినీకి ఇష్టంలేదని ట్రోలింగ్స్ రావడంత ఈ రోజు మీడియా ముఖంగా స్పందించారు సూపర్ స్టార్.
రజనీకాంత్ మాట్లాడుతూ.. “రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం, గతంలో తమిళనాడులో ఎమ్జీఆర్ (MGR), ఆంధ్రాలో నందమూరి తారకరామారావు (NTR) సాధించిన విజయాల కంటే చాలా పెద్ద విజయం. ఆ కాలంలో ఆ ఇద్దరు మహానాయకులు ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల కంటే, ప్రస్తుత కాలంలో విజయ్ ఎదుర్కొని నిలబడిన పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైనవని ఆయన విశ్లేషించారు. విజయ్ సాగించిన ఒంటరి పోరాటం చేసి కేంద్రంలో పూర్తి అధికార బలంతో ఉన్న బీజేపీని, దశాబ్దాలుగా తమిళనాట పాతుకుపోయిన అధికార డీఎంకే (DMK), బలమైన ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) వంటి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను విజయ్ ఏకకాలంలో ఢీకొట్టారు. ఎటువంటి పొత్తులు లేకుండా కేవలం సొంత బలంపైనే ఒంటరిగా పోరాడి ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం అసాధ్యమైన విషయం. ఒక నూతన ప్రాంతీయ పార్టీ ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడం తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ సాధించిన ఈ అసాధారణ గెలుపు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్తూ.. భవిష్యత్తులో విజయ్ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని కోరుకుంటున్నాను, విజయ్ పట్ల నాకు ఎటువంటి అసూయా లేదు’ నేను రాజకీయాల్లో కూడా లేను, అలాంటప్పుడు విజయ్‌ని చూసి నేనెందుకు అసూయ పడతాను..? బహుశా కమల్ సీఎం అయితేనేమో అసూయ పడొచ్చు. నాకూ విజయ్‌కీ మధ్య తరం అంతరం ఉంది.. మేమిద్దరం ఒకరితో ఒకరు పోటీ పడితే అది మా ఇద్దరికీ మంచిది కాదు అని అన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
“At the age of 52, he has achieved more than MGR & NTR. He faced & won against the BJP at the Centre & 2 parties here. It was a surprise filled happiness for me. No Jealousy. Lot of expectations for Vijay. My best wishes to him.”
– Superstar #Rajinikanthpic.twitter.com/Xuk818mqtK
— Laxmi Kanth (@iammoviebuff007) May 17, 2026
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!