Site icon NTV Telugu

Hyper Aadi: వర్షిణితో హైపర్ ఆది పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్

Varshini

Varshini

Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల్లో రచయితగా, స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హైపర్ ఆది.. ఇంకోపక్క జనసేన లో ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా కనిపించేవాడో.. ఇప్పుడు హైపర్ ఆది కనిపిస్తున్నాడు. ఇక ఆది కెరీర్ గురించి పక్కనపెడితే.. గత కొన్నిరోజులుగా అతని పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారింది. హైపర్ ఆది కొన్నేళ్లుగా ఒక యాంకర్ తో ప్రేమలో ఉన్నాడని, ఆ యాంకర్ వర్షిణి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ కలిసి ఢీ అనే ప్రోగ్రాం లో చేశారు. అంతే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా కలిసే చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లి వరకు వెళ్లిందని వార్తలు వినిపించాయి. ఈ విషయమై హైపర్ ఆది స్పందించలేదు కానీ, వర్షిణి మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయాన్నీ ఖండిస్తూనే వస్తుంది.

MP Sanjay Raut: సంజయ్‌ రౌత్‌ సంచనల వ్యాఖ్యలు.. వారణాసిలో మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పక గెలుస్తుంది

మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలను ఖండించింది. అలాంటిందేం లేదని, నా పెళ్లి విషయం పూర్తిగా మా అమ్మానాన్నలకు వదిలేస్తున్నాను అని చెప్పింది. ఇక తాజాగా వర్షిణి తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ చిట్ చాట్ సెషన్ లో కూడా ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆదికి, వర్షిణికి పెళ్లి అంట నిజమేనా.. ? అన్న ప్రశ్నకు.. షాకింగ్ ఎమోజిలను ఆన్సర్ గా ఇచ్చింది. దీంతో మరోసారి అందులో నిజం లేదని చెప్పకనే చెప్పింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడిందనే చెప్పాలి. మరి ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది పెళ్లి కబురు చెప్తుందేమో చూడాలి.

Exit mobile version