NTV Telugu Site icon

Adah Sharma: అదాశర్మను బెదిరించిన హైదరాబాదీ యువకుడు.. దాన్ని లీక్ చేస్తూ

Adah

Adah

Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది అదా శర్మ. వివాదాస్పదమైన సినిమాగా మే 5 న రిలీజ్ అయిన కేరళ స్టోరీ.. రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి హీరోయిన్ అదాకు, డైరెక్టర్ సుదీప్తో సేన్ కు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రమాదకర ISIS ప్రమేయంతో బలవంతంగా ఇస్లాం మతంలోకి మారే అమ్మాయిల కథతో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం కావడంతో చాలామంది ముస్లిం యువకులు అదాపై విరుచుకు పడుతున్నారు. ఇక తాజాగా ఒక హైదరాబాదీ ముస్లిం యువకుడు అదాను బెదిరించాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె ఒరిజినల్ ఫోన్ నంబర్ ను షేర్ చేస్తూ.. ఆమెను తిట్టమని ప్రోత్సహిస్తున్నాడు. కేరళ స్టోరీ బనాతీ అబ్ హైదరాబాదీ బచ్చి తేరీ స్టోరీ బనాటే అని రాసి ఉన్న వాట్స్ ఆప్ స్టోరీని పోస్ట్ చేస్తూ ఆమె నంబర్ ను కింద యాడ్ చేశాడు. ఇక ఈ మాటతో అతను హైదరాబాద్ కు చెందిన యువకుడుగా గుర్తించారు.

Harish Shankar: నేను హామీ ఇస్తున్నా.. 2018 మీకు బాగా నచ్చుతుంది

ఇక ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ అకౌంట్ డీయాక్టివ్ అయిపోవడం గమనార్హం. ఇక ఈ పోస్ట్ చూసిన అదా అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇలాంటి క్రూరమైన చర్యలు చేపట్టినవారిని ఊరికే వదిలి పెట్టకూడదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ చెప్తున్నారు. కాగా ఈ వార్తలపై అదాశర్మ ఎంత మాత్రం స్పందించలేదు. అయితే ఇలాంటి బెదిరింపులు ఏమి ఆమెకు కొత్త కాదు.. కొన్నిరోజుల క్రితమే ఆమె ఒక రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యింది. అదికూడా కావాలనే ఎవరో చేసినట్లు ఉన్నారని పలువురు చెప్తున్నారు. మరి ముందు ముందు ఇలాంటి బెదిరింపులు ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Show comments