Site icon NTV Telugu

నటి చౌరాసియాపై దాడి.. నిందితుడు ఎవరో తెలిస్తే షాక్!

shalu chourasiya

shalu chourasiya

నటి చౌరాసియాపై దాడి కేసు మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఆమె జాగింగ్ చేస్తుండగా ఓ అగంతకుడు అమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పరారయినా నిందితుడ్ని బాబుగా పోలీసులు గుర్తించారు. అతడు సినిమా సెట్లలో లైట్స్ వేసే వ్యక్తిగా గుర్తించారు. నటి సెల్ ఫోన్ సిగ్నల్ వలనే బాబును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. శుక్రవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.

బాబు వద్ద నటి ఫోన్ దొరకలేదని, ఒకవేళ ఆ ఫోన్ ని అమ్మేశాడా ..? లేక మరెవరికైనా ఇచ్చాడా..? అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఆదివారం తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్‌ చేశాడని, తన వద్ద డబ్బు లేదు, కావాలంటే పేటీఎం చేస్తానని చెప్పిన అతను వినకుండా తనపై దాడి చేసినట్లు చౌరాసియా పోలీసులకు తెలిపింది. అతని ప్రైవేట్ పార్ట్ పై తన్ని తాను తప్పించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Exit mobile version