Rajiler: జైలర్ కలెక్షన్స్ లో డ్రాప్… రజినీ కాళ్లు మొక్కడమే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్ సినిమా పది రోజులవుతున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. అన్ని సెంటర్స్ లో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసిన జైలర్ సినిమా తెలుగులో 50, కర్ణాటకలో 50, కేరళలో 45, ఓవర్సీస్ లో 120 కోట్లు క్రాస్ చేసింది. బయ్యర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తున్న జైలర్ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్ల కలెక్షన్స్ ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు.
ఇతర ప్రాంతాల్లో జైలర్ హవా ఈ వీకెండ్ కి కూడా కంటిన్యు అవుతూ ఉంది కానీ కోలీవుడ్ లో మాత్రం జైలర్ కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది. ఊహించని ఈ డ్రాప్ కి కారణం ఏంటాని చూస్తే, ఇటీవలే రజినీకాంత్ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ని కలిసాడు. ఈ సంధర్భంగా 72 ఏళ్ల రజినీ, 51 ఏళ్ల యోగీ ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం తమిళ ప్రజల మనోభావాలని బాగా దెబ్బతీసింది. బీజేపీ పార్క్ ముఖ్యమంత్రిని కలవడమే తమిళనాడులో పెద్ద విషయం అయితే అతని కాళ్లు సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న రజినీకాంత్ మొక్కడం తమిళ ప్రజలని మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే యోగీ ఆదిత్యనాథ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు గోరఖ్ మఠ్ మహంత్ కూడా కావడంతోనే రజినీకాంత్ కాళ్లు మొక్కాడు అనేది కొందరి వాదన. ఏది ఏమైనా జైలర్ సినిమా కలెక్షన్స్ కి డ్రాప్ కి స్వయంగా రజినీకాంత్ కారణమవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.
Also Read
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్‌లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!