NTV Telugu Site icon

Rajiler: జైలర్ కలెక్షన్స్ లో డ్రాప్… రజినీ కాళ్లు మొక్కడమే కారణమా?

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్ సినిమా పది రోజులవుతున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. అన్ని సెంటర్స్ లో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసిన జైలర్ సినిమా తెలుగులో 50, కర్ణాటకలో 50, కేరళలో 45, ఓవర్సీస్ లో 120 కోట్లు క్రాస్ చేసింది. బయ్యర్స్ కి హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తున్న జైలర్ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్ల కలెక్షన్స్ ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు.

ఇతర ప్రాంతాల్లో జైలర్ హవా ఈ వీకెండ్ కి కూడా కంటిన్యు అవుతూ ఉంది కానీ కోలీవుడ్ లో మాత్రం జైలర్ కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది. ఊహించని ఈ డ్రాప్ కి కారణం ఏంటాని చూస్తే, ఇటీవలే రజినీకాంత్ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ని కలిసాడు. ఈ సంధర్భంగా 72 ఏళ్ల రజినీ, 51 ఏళ్ల యోగీ ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం తమిళ ప్రజల మనోభావాలని బాగా దెబ్బతీసింది. బీజేపీ పార్క్ ముఖ్యమంత్రిని కలవడమే తమిళనాడులో పెద్ద విషయం అయితే అతని కాళ్లు సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న రజినీకాంత్ మొక్కడం తమిళ ప్రజలని మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే యోగీ ఆదిత్యనాథ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు గోరఖ్ మఠ్ మహంత్ కూడా కావడంతోనే రజినీకాంత్ కాళ్లు మొక్కాడు అనేది కొందరి వాదన. ఏది ఏమైనా జైలర్ సినిమా కలెక్షన్స్ కి డ్రాప్ కి స్వయంగా రజినీకాంత్ కారణమవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.