బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే పవర్స్ తో 2006లో ‘క్రిష్’ అనే సూపర్ హీరో పుట్టాడు. ఇండియన్ స్క్రీన్ పై హైటెక్నికల్ స్టాండర్డ్స్ తో వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా క్రిష్ చరిత్రలో నిలిచిపోయింది. టైటిల్ రోల్ లో హృతిక్ రోషన్ నిజంగానే సూపర్ హీరోలా కనిపించాడు. తనకంటూ సెపరేట్ సూటు, మాస్క్ ఫిక్స్ చెయ్యడంతో చిన్నపిల్లలు కూడా క్రిష్ సినిమాకి కనెక్ట్ అయ్యారు. ఇక్కడి నుంచి ఏడేళ్ళ తర్వాత 2013లో క్రిష్ ౩ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకి పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత క్రిష్ 4 గురించి న్యూస్ బయటకి వచ్చింది. హృతిక్ రోషన్ ఫాన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న క్రిష్ 4 సినిమా 2024లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘ఫైటర్’, ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే క్రిష్ 4 సెట్స్ పైకి వెళ్తుందట. అయితే ఇప్పటివరకూ హిందీకి మాత్రమే పరిమితం అయిన క్రిష్ ఫ్రాంచైజ్ ఈసారి మాత్రం బౌండరీలు దాటేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా క్రిష్ 4ని, ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ ని చూపించడమే ఈ సినిమా టార్గెట్ అంట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం క్రిష్ 4 సినిమా బాలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా సెట్స్ పైకి వెళ్తుందని టాక్.