వార్ సినిమాతో 450 కోట్లకి పైగా కలెక్ట్ చేసి సాలిడ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్-హీరో హ్రితిక్ రోషన్ లు మరోసారి కలిసి యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన చూపించడానికి రెడీ అయిన ఈ ఇద్దరూ ఫైటర్ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్నారు. మరో 48 గంటల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియాలోనే అత్యధిక ఏరియల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాగా ఫైటర్ పేరు తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ లో చూపించిన ఏరియల్ యాక్షన్స్ బ్లాక్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టాప్ గన్ మేవరిక్ సినిమాతో ఫైటర్ ని కంపేర్ చేస్తూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు.
హ్రితిక్ లుక్ కూడా టామ్ క్రూజ్ రేంజులోనే ఉండడంతో సినీ అభిమానులు జనవరి 25న ఒక సాలిడ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని సిద్ధార్థ్ ఆనంద్ ఎంతవరకు అందుకుంటాడు అనే దానిపైనే ఫైటర్ సినిమా రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంది. ఐమ్యాక్స్ వర్షన్ లో కూడా రిలీజ్ కానున్న ఫైటర్ సినిమా 166 నిమిషాల నిడివితో ఆడియన్స్ ముందుకి రానుంది. రెండు గంటల 46 నిమిషాల యాక్షన్ సినిమా… అది కూడా ఎక్కువ శాతం ఏరియల్ షాట్స్ ఉంటాయి అంటే చిన్న విషయం కాదు. సిద్దార్థ్ ఆనంద్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసి సినిమాని తెరకెక్కించి ఉంటే రెండు గంటల నలభై ఆరు నిమిషాల పాటు ఆడియన్స్ థ్రిల్ అవ్వడం గ్యారెంటీ. మరి ఫైటర్ సినిమాతో హ్రితిక్-సిద్ధార్థ్ పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటారు అనేది చూడాలి.