సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా అన్ని భాషల్లోనూ అమ్మడు హావా కొనసాగిస్తోంది. ఇక ఒకపక్క సినిమాలతో సంపాదిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలతో దుమ్ము రేపుతూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక వీటితో పాటు సామ్ తనకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో ఉండే అమ్మడు.. పెయిడ్ ప్రమోషన్స్ ..అంటే ఇన్స్టాగ్రామ్ లో సామ్ ఒక్క పోస్ట్ పెడితే దాదాపు పాతిక లక్షల రూపాయల నుండి 60 లక్షల రూపాయల వరకు ఆమె పారితోషికం ఉంటుందట. సమంత నెలలో కనీసంగా కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు ఈ ప్రమోషనల్ పోస్ట్ ల ద్వారా సంపాదిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల గుసగుసలు. ఏంటీ ఇది నిజమా అంటే అవును నిజమే.. ప్రస్తుతం సామ్ ఈ విధంగా కూడా గట్టిగానే సంపాదిస్తుంది.
ఇక మొన్నటికి మొన్న పుష్ప ఐటెం సాంగ్ కోసంకోట్లలలో పారితోషికం తీసుకున్న సామ్.. తన రేంజ్ కి తగ్గట్టే ఒక్కో సినిమాకు పారితోషికాన్ని పెంచేస్తుంది అంట. టాలీవుడ్ లో అయితే ఒక రేట్.. బాలీవుడ్, హాలీవుడ్ లో అయితే అంతకు డబుల్ రెమ్యూనిరేషన్ చెప్తున్నదట. ఈ లెక్కన చూస్తే అమ్మడి సంపాదన కోట్లలలో ఉందన్న మాటే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. విడాకులు తీసుకున్నాకా.. అందాల ఆరబోతను పెంచి అవకాశాలను రాబట్టుకొని కెరీర్ ని గట్టిగానే ప్లాం చేస్తుంది కుందనపు బొమ్మ. ఇక బాలీవుడ్ లో అయితే స్టార్ హీరోయిన్ల మించి సామ్ రెమ్యూనిరేషన్ చెప్పిందని టాక్. ఇక ఇది ఇలాగే కొనసాగితే మరో మూడేళ్లు అమ్మడి స్టార్ హోదాకు తిరుగులేదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
