Site icon NTV Telugu

Honeymoon Express: ఆహాలో ట్రెండింగ్‌గా హెబ్బా పటేల్ రొమాంటిక్ మూవీ

Honeymoon Express

Honeymoon Express

Honeymoon Express : కంటెంట్‌ బాగుంటే చిన్ని సినిమాలైనా పెద్ద విజయాలను అందుకుంటాయని ఇటీవల ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. అలాంటి సినిమాలకు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే ఏకంగా నెలల తరబడి ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు అదే కోవలో ట్రెండింగ్‌లో నిలిచింది ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. బాల రాజశేఖరుని డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రంలో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని చెప్పుకోవచ్చు. అలాగే చైతన్య రావు చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

Read Also:Kanaka Durga Temple: నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు.. రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ..

అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఇప్పటికీ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. చైతన్య రావు, హెబ్బా పటేల్‌ల జంటకు, వారి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆహాలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ము లేపుతోంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా ఆహా వినియోగ దారులను సైతం ఎంటర్ టైన్ చేస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ చిత్రం అంతగా నచ్చేస్తోంది.

Read Also:Bangladesh Durga Puja: బంగ్లాదేశ్లో దుర్గాపూజ వేడుకల్లో హింస.. పెట్రోల్ బాంబులతో దాడి

Exit mobile version