Prabhas Fans: సలార్ మళ్లీ డిజప్పాయింట్… ప్రభాస్ ఫ్యాన్స్ కే ఇలా ఎందుకు జరుగుతుందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫైనల్‌గా బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని అనుకున్నారు కానీ సలార్ ఫైనల్ కలెక్షన్స్ 700 నుంచి 800 కోట్ల మధ్యలోనే ఆగిపోయేలా ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెచ్ రీచ్ అవడంతో పాటు… నైజాం వంటి ఏరియాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు మేకర్స్ కనీసం సక్సెస్ సలెబ్రేషన్స్ కూడా చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని సలార్ మేకర్స్… సక్సెస్ విషయంలోను అదే ఫాలో అయ్యారు. ఒక్క చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. సక్సెస్ మీట్‌లో అయిన ప్రభాస్ బయటికి వస్తాడు అనుకుంటే… సైలెంట్‌గా కానిచ్చేశారు. సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో… చిత్ర యూనిట్ చిన్న సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారు.
సలార్ సినిమా బ్లాక్ థీమ్‌లో తెరకెక్కడంతో… ఈ సక్సెస్ పార్టీలో అందరూ కూడా బ్లాక్ డ్రెస్‌లోనే కనిపించడం విశేషం. ప్రభాస్, పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సలార్ సక్సెస్‌ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నారు. అదుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో ప్రభాస్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా కూల్‌గా కనిపించాడు కానీ… ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎలాగూ… సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు… కనీసం సక్సెస్ మీట్ అయిన గ్రాండ్‌గా చేస్తారని ఫ్యాన్స్ భావించారు కానీ ఇప్పుడు ఇలా సింపుల్ చేసేసి డార్లింగ్ అభిమానులను నిరాశ పరిచారు. ఏదేమైనా… సలార్ హిట్ అయింది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు.
Also Read
- Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
- Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
తాజావార్తలు
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!