Site icon NTV Telugu

Tollywood : పాన్‌ ఇంటర్నేషన్‌గా తెలుగు సినిమా.. మహేశ్‌, బన్నీ, ప్రభాస్‌ సినిమాల్లో హాలీవుడ్‌ స్టార్స్‌..

Tollywood (3)

Tollywood (3)

తెలుగు సినిమా పాన్‌ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్‌ ఇంటర్నేషన్‌ మూవీనే. నిన్నటివరకు పాన్‌ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్‌ మారింది. ఇక నుంచి హాలీవుడ్‌ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్‌   లైగర్‌ కోసం ఏరికోరి మైక్‌ టైసన్‌ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్‌ను టైసన్‌కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్‌ కావడంతో మైక్‌ టైసన్‌కు మరో ఛాన్స్‌ దక్కలేదు.

బాహుబలితో తెలుగు సినిమాను పాన్‌ ఇండియాకు ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ వరల్డ్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళీకే దక్కుతుంది. జక్కన్న నెక్ట్స్‌ మూవీ కోసం హాలీవుడ్‌ వెయిట్‌ చేస్తున్నట్టు స్టార్‌ డైరెక్టర్స్‌ స్పీల్‌బర్గ్‌ జేమ్స్‌ కామెరూన్‌ చెప్పారు. హాలీవుడ్‌ యాక్టర్స్‌తో పని చేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌లో జెన్నిఫర్‌గా ఒలీవియా మోరిస్‌  గవర్నర్‌ స్కాట్‌గా రే స్టీవెన్సన్‌ లేడీ స్కాట్‌గా సాముతిరాకని నటించారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి మహేశ్‌తో యాక్షన్‌ ఎడ్వెంచర్‌ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నాడన్న టాక్‌ వచ్చినా మెయిన్‌ విలన్‌గా హాలీవుడ్‌ యాక్టర్‌ను తీసుకుటుంన్నాడట. క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్‌ వరల్డ్‌ హయ్యెస్ట్ పెయిడ్‌ యాక్టర్స్‌లో ఒకడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వచ్చే ప్రభాస్, సందీప్‌ వంగా సినిమా ‘స్పిరిట్‌’ కోసం కొరియన్‌ స్టార్‌ డాన్‌ లీని తీసుకుంటున్నారట. ఈ హాలీవుడ్‌ స్టార్‌కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్‌ పేరు ఎనౌన్స్‌ చేయాల్సి వుంది హాలీవుడ్‌ రేంజ్‌ కాన్సెప్ట్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ విఎఫ్‌ఎక్స్‌తో అల్లు అర్జున్‌, అట్లీ సినిమా రూపొందుతోంది. హీరోయిన్‌గా దీపిక పేరును మాత్రమే ప్రకటించినా.. ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్‌ ఠాకూర్‌.. జాన్వి కపూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్‌గా హాలీవుడ్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ పేరు బైటకొచ్చింది. ఆస్కార్‌ అందుకున్న విల్‌ స్మాత్‌ భారతీయ హిందీ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2’లో అతిథిగా సందడి చేశాడు.

Exit mobile version