నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్3. నాని హీరోగా నటిస్తు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏ సినిమా ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్నఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూపించాడనే కామెంట్స్ వినిపించాయి. సూపర్ హిట్ తో పాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది హిట్3. తోలిరోజు ఏకంగా రూ . 43 కోట్లతో సూపర్బ్ స్టార్ట్ అందుకుంది.
Also Read : Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
అయితే హిట్ 3 సూపర్ హిట్ వేళ ఈ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ లో హీరోగా నటించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నాడు. అందుక్కారణం హిట్ 3 బాగుంది కానీ ఓవర్ వైలెన్స్, హింసాపాళ్ళు ఎక్కువగా ఉన్నాయని సినిమాలో డ్రామా అంతగా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో అర్జున్ సర్కార్ గా నాని కంటే హిట్ లోని విక్రమ్ పాత్రలోని విశ్వక్ సేన్ బాగా ఆకట్టుకున్నాడు అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ విశ్వక్ ను ట్యాగ్ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే హిట్ 3 లో డ్రామా కంటే వైలెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హిట్ ఫస్ట్ కేస్ లో డ్రామాను మేజర్ హైలెట్ గా నడిపిస్తూ వైలెన్స్ ను బ్యాలెన్స్డ్ గా నడిపించాడు. బహుశా అదే ఆడియెన్స్ కు కనెక్ట్ అయి ఉండొచ్చు.