విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా సెకండ్ పార్ట్ లో అడవి శేష్ మెరవనున్నాడు. అంతేకాకుండా మొదటి కేసు తెలంగాణ లో జరుగగా .. రెండో కేసును ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాను వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో న్యాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో అడవి శేష్ ని కెడి.. కృష్ణ దేవ్ అని పరిచయం చేసి థ్రిల్ చేసిన మేకర్స్.. తాజాగా అడవి శేష్ బర్త్ డే సందర్భంగా హిట్ 2 సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ గ్లింప్స్ లో అడవి శేష్ చాలా కూల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించాడు.. ఇక ప్రతి ఫ్రేమ్ లోను శేష్ పక్కన కుక్క ఉండడం చూస్తుంటే .. ఇందులో దానికో ప్రత్యేక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.. కేసు కోసం అడవి శేష్ పడిన తపన మొత్తం ఈ వీడియో లో చూపించారు. డైలాగ్స్ లేకుండా మొత్తం మ్యూజిక్ తోనే నడిచిన ఈ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకొంటోంది. అస్సలు శేష్ ని అంతలా ఇబ్బ్బంది పెట్టిన కేసు ఏంటి అనేది తెలుసుకోవాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతుంది. మరి విశ్వక్ సేన్ తో హిట్ కొట్టిన నాని ఈసారి అడవి శేష్ తో హిట్ కొడతాడేమో చూడాలి.
