Site icon NTV Telugu

Nandamuri Balakrishna: బాలయ్యపై కేసు పెట్టిన హిజ్రాలు.. ?

Balayya

Balayya

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు. ఇటీవలే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై తనదైన రీతిలో ఫైర్ అయిన బాలయ్య.. ప్రత్యర్థుల తీరును ఎండగట్టాడు. ఇక ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ పై హిందూపురం పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హిందూపురంలో బాలయ్య ఉండడంలేదని కొంతమంది హిజ్రాలు బాలయ్యపై ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు బాలకృష్ణపై ఎంతోమంది పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే మొదటిసారి హిజ్రాలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

హిందూపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ ఉండడం లేదని, వెంటనే హిందూపురంలోని సమస్యలను పట్టించుకోని వాటికి పరిష్కారాలు వెతకాల్సిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలనే కొంతమంది ప్లాన్ చేసి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో లేరు.. హిందూపురంలోనే బాలయ్య తో పాటు మరికొంతమంది కూడా లేరు.. కానీ ఫిర్యాదు మాత్రం బాలయ్య మీదనే ఎలా ఇస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు.మరి ఈ ఫిర్యాదు వెనుక ఉన్నది ఎవరు..? ఈ కేసు విషయమై బాలయ్య ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Exit mobile version