NTV Telugu Site icon

Mark Antony: ‘మార్క్ ఆంటోనీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబర్ 15న రిలీజ్

Mark Antony

Mark Antony

Highcourt Stay Vacated Vishal’s ‘Mark Antony’ to release on Spetember 15: విశాల్ హీరోగా ఎస్జే సూర్య కీలక పాత్రలో మార్క్ ఆంటోని సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రలలో ఈ సినిమాను ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ‘మార్క్ ఆంటోని’ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదల మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా హీరో విశాల్‌కు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో విశాల్ సమస్య తీరిపోయేలా కోర్టు తీర్పు లభించింది. దీంతో మార్క్ ఆంటోని విడుదలకు మార్గం సుగమం అయిందని చెప్పొచ్చు. దీంతో ముందు ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విశాల్ మార్క్ ఆంటోని చిత్రం రిలీజ్ కాబోతోంది.

Srikanth Iyengar: ఏపీలో బూమ్ బూమ్ తాగుతున్నా, ఏమవుతుందో?.. శ్రీకాంత్ అయ్యంగార్ వీడియో వైరల్

మార్క్ ఆంటోనీ సినిమాను విడుదల చేసేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది, సెప్టెంబర్ 15న మార్క్ ఆంటోని సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది అంటూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. విశాల్ మార్క్ ఆంటోని చిత్రంలో ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించగా.. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. నటుడు సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్ స్లే, వైజి మహేంద్రన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా మార్క్ ఆంటోని టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా పీరియాడిక్ సినిమా కావడం, సైన్స్ ఫిక్షన్ కూడా యాడ్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అనేది తెలియాల్సి ఉంది.

Show comments