న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి అంటే మౌత్ టాక్ ఎంత హెల్ప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హాయ్ నాన్న రిలీజ్ కి ముందు అనిమల్ సినిమా నాని సినిమాని తినేస్తుంది అనుకున్నారు కానీ హాయ్ నాన్న మౌత్ టాక్ పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో అనిమల్ టాపిక్ వినిపించట్లేదు. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడానికి హాయ్ నాన్న సినిమా చాలా దూరంలో ఉన్నా కూడా సలార్ రిలీజ్ అవ్వడానికి ఇంకా పది రోజుల సమయం ఉండడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసే లాగే ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హాయ్ నాన్న సినిమా ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కన్నా ఓవర్సీస్ లోనే ఇంకా ఎక్కువగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది హాయ్ నాన్న సినిమా. నాని ఓవర్సీస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నాడు. హాయ్ నాన్న అనే కాదు నాని నటించిన ప్రతి సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. ఓవర్సీస్ లో నానికి మన స్టార్ హీరోలని కూడా వెనక్కి నెట్టే రేంజ్ మార్కెట్ ఉంది. యుఎస్ బాక్సాఫీస్ దగ్గర నాని ఇప్పటివరకు హాయ్ నాన్న సినిమాతో కలిపి 9 సార్లు వన్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసాడు. ఈ రికార్డ్ తెలుగులో పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్న హీరోలకి కూడా లేదు. మహేష్ బాబు తర్వాత అన్ని వన్ మిలియన్ డాలర్ సినిమాలు ఉన్న హీరో నాని మాత్రమే. చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా నాని తర్వాతే ఉన్నారు. అందుకే నాని యుఎస్ వెళ్లి మరీ హాయ్ నాన్న సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.