Site icon NTV Telugu

Yellamma : నితిన్ తో నటించేందుకు నో చెప్పేస్తున్న హీరోయిన్స్

Nithiin

Nithiin

బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇక తన రెండవ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేస్తున్నాడు వేణు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ను ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.

Also Read : Puri Jagannath : బెగ్గర్ కోసం కన్నడ స్టార్ హీరో

కాగా ఈ సినిమాకు అనికొని అవరోధాలు ఏర్పడుతునే ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. గతంలో సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా ఈ చిత్రానికి నో చెప్పింది. ఇక రీసెంట్‌గా ఈ మూవీలో కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు కీర్తి కూడా నితిన్ తో చేసేందుకు నో చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. కీర్తి కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందనే కారణం వినిపిస్తోంది. వరుస ప్లాప్ లు కొడుతున్న నితిన్ సరసన హీరోయిన్ గా చేయడం ఇష్టం లేక డేట్స్ కారణంగా చెప్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పయికే నితీన్ తో శ్రీలీల చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతోప్లాప్ జోడి అనే ముద్ర పడింది. అందుకు ఇప్పుడు హీరోయిన్స్ ఈ యంగ్ హీరోతో చేసేందుకు ముందు వెనక ఆలోచిస్తున్నారు. మరి ఫైనల్ గా నితిన్ కు ఎవరు దొరుకుతారో చూడాలి.

Exit mobile version