Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు సపోర్ట్ చేశారు. నాతో పాటు షూటింగులకు వస్తూ తోడుగా ఉన్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటూ ఎమోషనల్ అయింది.
Read Also : Teja Sajja : మూడు సీక్వెల్స్.. అప్డేట్లు ఇచ్చిన తేజ
మా నాన్న చాలా ఏళ్లు నాతో సినిమా షూటింగులకు వచ్చిన తర్వాత ఆ బాధ్యత మా అమ్మ తీసుకుంది. ఆ తర్వాత మా నాన్న ఓ చిన్న క్లినిక్ ఓపెన్ చేసి ఎంతో మందికి సేవలు చేశారు. ఆయన కూతురుగా నేను గర్వ పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది సదా. దీంతో ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. అప్పట్లో కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేసింది. ఒకప్పుడు ఈ బ్యూటీ చేసిన జయం, ఔనన్నా కాదన్నా లాంటి సినిమాలు ఇండస్ట్రీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
Read Also : K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..