Site icon NTV Telugu

Rambha Family Car Accident: హీరోయిన్ రంభ ఫ్యామిలీకి యాక్సిడెంట్.. పిల్లలతో వెళ్తుండగా ప్రమాదం

Rambha

Rambha

Rambha Accident: సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. రంభకు మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో అభిమానులను విజ్ఞప్తి చేసింది. ‘మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు.. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్.. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకెంతో ముఖ్యమైనవి’ అంటూ రంభ వేడుకుంది.

Read Also: కంచె దాటుతున్న అందాలు.. అఖండ హీరోయిన్ ఫోటోస్ వైరల్

ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు రంభ ఫ్యామిలీకి అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు. ఓరి దేవుడా.. జాగ్రత్తగా ఉండుమా.. మీ కోసం నేను ప్రార్థిస్తాను అని స్నేహ చెప్పుకొచ్చింది. ఓ.. మీరేం బాధపడకండి.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. మీకోసం నేను ప్రార్థిస్తాను అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. కాగా హీరోయిన్ రంభ పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఆనందంగా కెనడాలో గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యామిలీకి యాక్సిడెంట్ కావడం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. గతంలో తెలుగులో అగ్ర హీరోలందరితోనూ రంభ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో ఆడిపాడింది.

Exit mobile version