కన్నడ నటి రాన్యా రావు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ కింద గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది సదరు రాన్యా రావు. రోజుకి ఎంతో మంది ఎయిర్పోర్ట్స్ లోడ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికి కటకటాల వెనక ఊసలు లెక్కేన్నారు. తాను హీరోయిన్ కదా చెకింగ్స్ ఏమి ఉండవ్ అనుకుందో ఏమో ఏకంగా 15 కేజీల బంగారం అయి ఉండి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసారు పోలీసులు. చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్నిబట్టబయలు చేసారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI). వివరాల్లోకెళితే రాన్యా రావు 15 రోజుల్లో 4 సార్లు బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్ళొచ్చింది. ఇక్కడే డిఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే దుబాయ్ నుండి వచ్చిన ప్రతిసారి చెకింగ్ కూడా లేకుండా పోలీసులు ఈమెను ఎయిర్పోర్ట్ దాటించేవారు, చెకింగ్స్ లేవా అంటే ఉన్నాయ్ కానీ అవి ఆమెకు ఉండవ్. ఎందుకంటే ఆమె స్వయానా డీజీపీ కూతరు. దాన్నీ అలుసుగా తీసుకుని గోల్డ్ స్మగ్లింగ్ కు తెరలేపింది రాన్యా రావు. పక్కా సమాచారంతో నటి రాన్యా రావుపై నిఘా పెట్టిన డిఆర్ఐ అధికారులు ఈ దఫా బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో దిగగానే అదుపులోకి తీసుకుని చెక్ చేయగా రూ. 12.56 కోట్లు విలువైన 15 కేజీల బంగారం, రూ. 4.73 కోట్ల విలువైన నగలు, కరెన్సీ దొరకడంతో ఖంగుతిన్నారు సదరు అధికారులు. అన్నిటిని సీజ్ చేసి ఆమెని అరెస్ట్ చేసారు. ఏదేమైనా ఇన్ని రోజులు పోలీసులను భలే బురిడీ కొట్టించి బాగా నటించింది కదా మహానటి అంటి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.