NTV Telugu Site icon

Amala Paul: హీరోయిన్ ని గుడిలోకి రానివ్వని పూజారులు…

Amala Paul

Amala Paul

సెలబ్రిటీలంటే ఓ క్రేజ్. వారికి గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. మనలాంటి సాధారణ వ్యక్తులను ఎవరూ పట్టించుకోరు కానీ అందరూ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడా కనిపించని వారు.. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొన్నిసార్లు ఇవేకాకుండా..సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అమలా పాల్ కి అదే జరిగింది. హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇద్దరమ్మాయిల సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటించి టాలీవుడ్ నే ఒక ఊపుఊపేసింది. దాదాపు సౌత్ లోని అన్ని భాషల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్ కి చేదు అనుభవం ఎదురయ్యింది.

Read also: RRR: హైదరాబాద్ తిరిగొచ్చిన జక్కన్న, కీరవాణి… త్వరలో ప్రెస్ మీట్?

కేరళలోని ఎర్నాకులం మహాదేవ ఆలయంలో ఉన్న అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌టానికి వ‌చ్చిన ఆమెను అల‌య అధికారులు గుడిలోనికి అడుగు పెట్ట‌నివ్వ‌లేదు. మహాదేవ ఆలయంలోకి అమలా పాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారు. మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని ఆల‌యానికి సంబంధించిన ప్రొటో కాల్‌ను పాటిస్తున్నామ‌ని అధికారులు అమలా పాల్ ని ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు. ఆమె క్రిస్టియ‌న్ అయినందుకు ఆల‌య అధికారులు ఆమెను గుడిలోనికి అనుమ‌తివ్వ‌లేదు. అంతగా కావాలంటే ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకొని వెన్నక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఆమె ఆలయం వద్దనుంచి వెనుతిరిగి వెళ్లిపోయింది.

Read also: Chiranjeevi: ‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’…

జరిగిన దాన్ని అమలా పాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో ‘‘2023వ సంవత్సరంలో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం, ఈ విషయం నన్ను నిరాశపరిచింది. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను, కానీ దూరం నుంచి ఆత్మను ప్రార్థించాను. త్వరలో మతపరమైన వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. సమయం వస్తుంది మనమందరం మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూస్తారు’’ రాసింది. ఈ ఉదంతం బయటకి రావడంతో కొందరు సెక్యులర్ కంట్రీలో ఈ మత పరమైన ఆంక్షలేంటి అంటున్నారు. మరికొందరేమో ప్రజల మత విశ్వసాలని గౌరవించాకి అంటున్నారు.
IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..

Show comments