Vishwak Sen: కొత్త కారు కొన్న ‘పాగల్’ హీరో.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు ఈ హీరోను వెంటాడుతాయో.. లేక వివాదాలను వెత్తుకుంటూ ఈ హీరోనే వెళ్తాడో తెలియదు కానీ ఈ యంగ్ హీరో సినిమా రిలీజ్ ఉంది అంటే మాత్రం వివాదం వచ్చిపడ్డట్లే.. ఇటీవలే విశ్వక్.. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. దీంతో ‘పాగల్’ హీరో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. సినిమా రిలీజ్ కు ముందు ఒక ఛానెల్ యాంకర్ తో విశ్వక్ గొడవా పాడడం, అదికాస్తా వైరల్ గా మారడం తెలిసిందే. అయినా వివాదాన్ని లెక్కచేయకుండా సినిమాను ప్రేక్షకులు ఆదరించడంపై విశ్వక్ అభిమానులకు థాంక్స్ చెప్తూ వస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా మరోసారి ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పాడు. ఈసారి ఎందుకు అంటే.. ఈ మాస్ కా దాస్ తాజాగా బెంజ్ కారు ఓనర్ గా మారిపోయాడు.
బెంజ్ జీ క్లాస్ 2022 మోడల్ టాప్ ఎండ్ కార్ ను విశ్వక్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. “నా డ్రీమ్ కార్ ని నిన్ననే కొనుగోలు చేశాను. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతీ విషయానికి ఎంతో ఆనందంగా వున్నా” అంటూ కారుతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఇక ఈ కారు విలువ సుమారుగా రూ. 1.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో అభిమానులు విశ్వక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ పోస్ట్ పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫన్నీగా స్పందించాడు. “కారు నాదే ఫోటోలు దిగుతాను అంటే ఇచ్చా” అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
తాజావార్తలు
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!