NTV Telugu Site icon

Hero Vijay: రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు.. డబ్బు తీసుకుని ఓటేస్తే..

Vijay Satires On Politics

Vijay Satires On Politics

Hero Vijay Satires On Tamilnadu Politics: తమిళనాడు రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు వేశాడు. చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో సమావేశమైన విజయ్.. మీరే కాబోయే ఓటర్లని, మీరే మంచి మంచి లీడర్లను రాబోయే కాలంలో ఎన్నుకోబోతున్నారని విద్యార్థుల్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. మన కన్నుతో మనమే గుచ్చికున్నట్లుగా.. ఇప్పుడు రాజకీయాల పరిస్థితి తయారైందని చురకలంటించాడు. డబ్బు తీసుకుని ఓటు వేయడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపాడు. ఒక ఓటుకి రూ.1000 చొప్పున లక్షన్నర మందికి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. దాని ముందు ఓ రాజకీయ నాయకుడు ఎంత సంపాదించి ఉంటాడో మీరే ఆలోచించుకోండని సూచించాడు. ఇలాంటి విషయాలన్నీ.. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పాఠం రూపంలో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నాడు. మీరందరూ వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారని.. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మీ తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు హీరో విజయ్ సూచించాడు.

Adapa Seshu: చంద్రబాబు కోసం పవన్ ముసుగు యాత్రలు చేస్తున్నారు

ఇదిలావుండగా.. ఈ సమావేశంలో తనకు చెందిన ‘పీపుల్స్ మూవ్‌మెంట్’ సంస్థ ద్వారా 10, 12వ తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందించాడు. ఇదే సమయంలో విద్యార్థులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘అసురన్’ సినిమాలోని ‘మన దగ్గర భూమి ఉంటే తీసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు, కానీ చదువు ఒక్కటే మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు’ అనే డైలాగ్‌ని ఉచ్ఛరించాడు. ఈ డైలాగ్ తనని బాగా ఆలోచించేలా చేసిందని, ఆ డైలాగే ఇలాంటి సమావేశం నిర్వహించేలా చేసిందని పేర్కొన్నాడు. తాను పుస్తకప్రియుడ్ని కాదని.. కానీ ఈ మధ్య పుస్తకాలు బాగా చదువుతున్నానని చెప్పాడు. విద్యార్థులు పుస్తకాలు చదవడం నేర్చుకోవాలని.. అంబేద్కర్, పెరియార్, కామరాజర్ గురించి తెలుసుకోవాలని చెప్పాడు. పరీక్షల్లో మార్కులు బాగా తెచ్చుకొని, విద్యార్థులకు అండగా నిలబడాలన్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి సమాజంలోని కొందరు వ్యక్తులు ఎప్పుడూ మీ పక్కనే ఉంటారని, వారిని పట్టించుకోవదని హితవు పలికాడు. జీవితంలో వ్యక్తిత్వం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

Minister Venugopala Krishna: పవన్ పూటకో వేషం వేస్తున్నాడు.. మంత్రి వేణు ధ్వజం

Show comments