Site icon NTV Telugu

Double Ismart: షూటింగ్ కంప్లీట్ చేసిన డబుల్ ఇస్మార్ట్.. మరి రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

Da

Da

Hero Ram & Director Puri Jaganath Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కానీ దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. అలానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సరైన హిట్ సినిమాలు పడలేదు. ఇప్పుడు వీళ్ళద్దరు మల్లి మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ గ తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్” సినిమా పైనే అటు హీరో రామ్ ఇటు పూరి దీనిపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read:Raj Tarun: బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రతినిధి పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు మేకర్స్ ఒక పోస్టర్ అధికారకంగా రేలీజ్ చేసారు. ఇక ఈ సినిమా ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకి స్వరాలు అందించనున్నారు.

Exit mobile version