Raj Tarun: బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు
- హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్
- రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు
- తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Rajtarun In Police Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నమ్మించాడని ఇప్పుడు చేసుకోకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాడని ఇప్పుడు దూరం పెట్టాడని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్తో రిలేషన్ లో ఉన్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేకసార్లు బెదిరింపులకు గురిచేశారని కూడా ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
Also Read; The Raja Saab: అవేమీ నమ్మొద్దు.. రాజా సాబ్ టీం కీలక ప్రకటన
Also Read
కేవలం రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన నార్సింగ్ లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అనే విషయం ఒకసారిగా తెర మీదకు వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తనను కావాలనే కొంతమంది ఇరికించారని తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం. తన సినిమాలోని ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు, నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నాను, ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!