Ram Pothineni: ‘రాపో’ – ‘ద వారియర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ కెరీర్ లో పలు పదనిసలు పలికించాడు. ఈ సారి ‘ద వారియర్’గా మురిపిస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
రామ్ పోతినేని 1988 మే 15న హైదరాబాద్ లో జన్మించాడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుని కుమారుడే రామ్. పెదనాన్న నిర్మించే చిత్రాలను చూస్తూ పెరిగాడు. చిన్నతనంలోనే రామ్ కు నటనపై మనసు మళ్ళింది. 14 ఏళ్ళ ప్రాయంలో ‘అడయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించాడు. వైవియస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’తో 18 ఏళ్ళకే హీరోగా వెలిగిపోయాడు రామ్. తరువాత సుకుమార్ ‘జగడం’లోనూ యువతకు ప్రతినిధిగా కనిపించాడు. శ్రీను వైట్ల ‘రెడీ’లో నవ్వులు పూయించాడు. బి.గోపాల్ ‘మస్కా’లో మైమరిపించాడు. ఇలా సాగిపోతున్న రామ్ కెరీర్ లోనూ కొన్ని ఎత్తులు, కొన్ని పల్లాలు ఉన్నాయి. ప్రేక్షకులను రంజింప చేయడానికి నవతరం కోరే పాత్రలను ఎంచుకుంటూ సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బంపర్ హిట్ అయింది. ఆ తరువాత డ్యుయల్ రోల్ ప్లే చేస్తూ ‘రెడ్’లో నటించాడు రామ్. ఈ సినిమా అంతగా అలరించలేకపోయినా, రామ్ అభినయం మాత్రం మంచి మార్కులే సంపాదించింది.
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ఓ వైపు మాస్ ను మెప్పిస్తూ, మరోవైపు తన సినిమాలకు క్లాస్ నూ రప్పించుకుంటున్నాడు రామ్. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ‘ద వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 14న జనం ముందుకు రానుంది. ఈ సినిమాలో సత్య ఐ.పి.యస్. పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటి దాకా తాను చేయనటువంటి భిన్నమైన పాత్రను ‘ద వారియర్’లో పోషించానని రామ్ అంటున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ జనాన్ని ఏ రీతిలో ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!