Prithviraj Sukumaran: ”ది గోట్ లైఫ్” 16 ఏళ్ళ ప్రయాణం.. 31 కిలోల బరువు తగ్గా: హీరో ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Prithviraj Sukumaran interview for “The Goat Life” Movie: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) రిలీజ్ కానుంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించగా విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ఎంతో శ్రమించారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా అనుభవాలను, తన కెరీర్ విశేషాలు లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
– వాస్తవ కథతో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. రచయిత బెన్యామిన్ నజీబ్ జీవితానికి అక్షర రూపమిస్తూ నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) తో నా జర్నీ మొదలైంది.
Also Read
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
– 2018లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం, ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించక జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నా, షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేయగా అక్కడి నుంచి బయటపడే వీలు లేక వందేభారత్ ఫ్లైట్ తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించి ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్ లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ లో రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది.
– ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశా, నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్ ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించా, 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్ లో నటించా, కష్టపడినా నజీబ్ క్యారెక్టర్ ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది.
– “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కోసం మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది.
– ఈ సినిమా కోసం సుదీర్ఘ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోలేరు, కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని సినిమాల్లో నటించలేకపోయినా ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదనిపించింది.
– “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం, ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది.
– డైరెక్టర్ బ్లెస్సీ నేను “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా రిలీజ్ కాబోతున్న రోజు కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం, ఇది మా కల. ఆ కల నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయి, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇంత కష్టపడి సినిమా ప్రేక్షకుల దగ్గరికి చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ను సెలెక్ట్ చేసుకున్నా.
– తెలుగులో మా సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. మైత్రీ రవికి ఫోన్ చేసి ఈ సినిమా నా కెరీర్ కు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పా, ఆయన మంచి రిలీజ్ చేద్దామని మాటిచ్చారు. మైత్రీ సంస్థ ద్వారా మా సినిమా ప్రేక్షకులకు విస్తృతంగా చేరువవుతుందని నమ్మకం ఉంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా తెలుగు వెర్షన్ కోసం మేము చాలా శ్రద్ధ తీసుకున్నాం. తెలుగు పాటల విషయంలో, డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లే తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను.
– లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్ లో నా పర్ ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నా.
– నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండా నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్ లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకు వచ్చే అరుదైన అవకాశం వదులుకోరని భావిస్తా.
తాజావార్తలు
-
Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!