Site icon NTV Telugu

Nikhil : టర్కీ వస్తువులు వాడొద్దు.. ఆ దేశానికి వెళ్లొద్దు..

Nikhil Siddhartha

Nikhil Siddhartha

Nikhil : ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు డ్రోన్లు, మిస్సైల్స్ ను సాయం చేస్తోంది టర్కీ. పాకిస్థాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్లు దాదాపు టర్కీ ఇచ్చినవే. మన దేశం మీద దాడికి పాక్ కు టర్కీ సాయం చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాయ్ కాట్ టర్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కూడా దీనిపై సీరియస్ గా స్పందించాడు. టర్కీ దేశాన్ని అందరూ బ్యాన్ చేయాలంటూ చెప్పాడు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ టర్కీ దేశం ప్రెసిడెంట్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశాడు.

Read Also : Central Cabinet Decisions: కొత్త ‘చిప్‌’ యూనిట్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

‘మంచి అయినా చెడు అయినా పాకిస్థాన్ తో మేము సంబంధాలు కొనసాగిస్తాం’ అంటూ ఆ వీడియోలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ.. ఈ వీడియో చూశారుగా.. ఇప్పడు ఆ దేశం వెళ్తామని ఎవరైనా చెబుతారా.. మన భారతీయులు చాలా మంది టర్కీ వెళ్తున్నారు. అక్కడ మన డబ్బులు ఖర్చు చేస్తున్నారు. టర్కీ వస్తువులు వాడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. వాళ్ల వస్తువులు వాడొద్దు. వాళ్ల దేశానికి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు.

Read Also : Pan India Movies : పాన్ ఇండియా సినిమాలు.. బాలీవుడ్ హీరోయిన్లే కావాలట..

Exit mobile version