NTV Telugu Site icon

Bedurulanka 2012: ‘శివశంకర వరప్రసాద్’గా కార్తికేయ..ఈసారి కొట్టేట్టు ఉన్నాడే!

Bedurulanka 2012 Movie Trailer

Bedurulanka 2012 Movie Trailer

Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Trailer Launched: డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు యుగాంతం రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్(కార్తికేయ) ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’ను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. బయట కూడా మెగాస్టార్ చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే, చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ‘బెదురులంక 2012’లో కార్తికేయ క్యారెక్టర్ పేరు కూడా అదే అన్నమాట. ఇప్పుడీ సినిమా ట్రైలర్ సైతం చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.

Eleven: నవీన్ చంద్ర హీరోగా బై లింగ్యువల్ ‘ఎలెవెన్’

ఇక కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా… ‘బెదురులంక 2012’లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. శివశంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ కనిపించగా… అతడిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా నేహా శెట్టి కనిపిస్తోంది. ఇక యుగాంతం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన పెద్దలకు శివ ఎలా బుద్ధి చెప్పాడు? అనేది కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ‘సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పప్పటికీ… ముందు మూడు యుగాలను అంతం అవ్వలేకుండా ఆపలేకపోయినప్పుడు, ఈ బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రామ్ ప్రసాద్) కలిసి కలి యుగాంతాన్ని ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి?’ అని హీరో ఓ డైలాగ్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది . కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని, ‘వెన్నెల’ కిశోర్ ఇతర కీలక పాత్రలలో నటించారు.