Site icon NTV Telugu

Daggubati Family : నాంపల్లి కోర్ట్ కు హీరో దగ్గుబాటి వెంకీ ఫ్యామిలీ

Daggubati

Daggubati

దక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13 వ తారీఖున అక్రమంగా కూల్చివేయడం తో పాటు అక్కడ వున్న సామగ్రి ని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు నమోదు చేయడం జరిగింది.

Also Read : Kollywood : అన్నాదమ్ముల సినిమాలు వచ్చేదెప్పుడు..?

కానీ దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసు ని లెక్కచేయకుండా మరోసారి 2024 మార్చి లో నందుకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్య లో వ్యక్తిగత బౌన్సర్ లను వినియోగించి పూర్తిగా నేలమట్టం చేశారు.హోటల్ లో వున్న కోట్ల విలువ చేసే సామగ్రి ని దొంగతనం చేశారు. దీనిపై నందకుమార్ మరోసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీ పై పిర్యాదు చేశాడు. కానీ ఈ ఫిర్యాదుపై పోలీస్ లు స్పందించలేదు. దాంతో నందకుమార్ మరో మారు నాంపల్లి కోర్టు ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై  కోర్టు స్పందిస్తూ జనవరి 2025 లో కేసు నమోదు చేయవలసినది గా పోలీస్ లని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీస్ లు మరోసారి కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి FIR NO:25/2025 గా నమోదు చేశారు, కానీ గత పది నెలలుగా ఈ కేసు పై ఎలాంటి విచారణ జరపకుండా ఫిల్మ్ నగర్ పోలీస్ లు కాలయాపన చేస్తున్నారు.

పోలీస్,న్యాయ వ్యవస్థలని డబ్బు మరియు పలుకుబడితో నిర్వీర్యం చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఈ రోజు అనగా జనవరి 9 న కోర్టు కి హాజరు కావలసి వుంది. గతంలో పలు మార్లు నోటీసులు అందిన విచారణకు గైర్హాజరైన దగ్గుపాటి ఫ్యామిలీ. ఈ సారి అయినా దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను గౌరవించి కోర్టు కు హాజరు అవుతారా లేదా అని వేచి చూడాలి. గతంలో వ్యక్తిగత బాండ్లను దగ్గుపాటి ఫ్యామిలీ తరపున లాయర్లు సమర్పించగా తిరస్కరించి కోర్టు ధిక్కరణ కింద వ్యక్తి గతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు. దగ్గుపాటి ఫ్యామిలీ మెంబెర్స్ స్వయంగా నేడు బాండ్లను ఇవ్వకుంటే నాన్ బైలబుల్ వారెంట్ (N.B.W) విందించే అవకాశం ఉంది.. ఈ కేసులో తనకు జరిగిన నష్టం పై న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పాడు దక్కన్ హోటల్ యజమాని నంద కుమార్.

Exit mobile version