రీసెంట్ గా ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ (#VedatMaratheVeerDaudleSaat) అనే టైటిల్ తో తెరక్కనున్న ఈ మూవీని ‘మహేశ్ మంజ్రేకర్’ డైరక్ట్ చేస్తున్నాడు. ‘అదుర్స్’, ‘సాహో’, ‘డాన్ శ్రీను’ సినిమాల్లో విలన్ గా నటించిన ‘మహేశ్ మంజ్రేకర్’, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు అక్షయ్ కుమార్ అనౌన్స్ చేసిన ఈ మూవీ ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ హిందీలో కాకుండా ‘మరాఠీ’ భాషలో తెరకెక్కుతుండడం విశేషం. ఛత్రపతి శివాజీ కథ అంటే తెలియని భారతీయుడు ఉండడు పైగా అక్షయ్ కుమార్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఇలాంటి సమయంలో ‘మరాఠ’ వరకే ఎందుకు పరిమితం అయ్యారు అనే విషయం మేకర్స్ కే తెలియాలి.
షూటింగ్ అయ్యాక పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తారేమో చూడాలి, ఇప్పటికైతే అలాంటి అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి రాలేదు. అయితే అక్షయ్ కుమార్, ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ సినిమా అనౌన్స్ చేయగానే… ‘పృథ్వీరాజ్ చౌహాన్’ సినిమాని చేసి చెడగోట్టాడు, ఇప్పుడు అక్షయ్ ‘శివాజీ’పైన పడ్డాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. లార్జ్ స్కేల్ సినిమాలకి ఎక్కువ టైం కేటాయించాలి కానీ అక్షయ్ కుమార్ మాత్రం 60 రోజుల్లోనే సినిమా పూర్తవ్వాలి అంటాడు. ఈ కారణంగానే అక్షయ్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో క్వాలిటీ లేకుండా పోతుంది అనేది సినీ అభిమానుల మాట. మరి ఆ విమర్శని అక్షయ్ కుమార్ ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ సినిమాతో అయినా చేరిపెస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే బాలీవుడ్ హిట్ సీరీస్ అయిన ‘హేరా ఫేరి 3’లో నటించే అవకాశం అక్షయ్ కుమార్ నుంచి ‘కార్తీక్ ఆర్యన్’కి వెళ్లింది అనే వార్త బీ-టౌన్ లో వినిపిస్తోంది. ఈ విషయంలో తాజా అప్డేట్ ఏంటంటే, ‘హేరా ఫేరి 3’ సినిమాలో ‘అక్షయ్ కుమార్’ మాత్రమే కనిపిస్తాడట, మరో హీరోకి వెళ్లడానికి మేకర్స్ సిద్ధంగా లేరని సమాచారం.
आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा !
आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z— Akshay Kumar (@akshaykumar) December 6, 2022