Site icon NTV Telugu

Twitter War: దారుణం.. స్టార్ హీరో చనిపోయాడని సోషల్ మీడియాలో ప్రచారం

కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ హీరోల మధ్య ఇటీవల నిత్యం ట్విట్టర్ వార్ జరుగుతోంది. దీంతో ఒకరి హీరోపై మరొక హీరో అభిమానులు దుమ్మెత్తిపోసుకోవడం కనిపిస్తోంది. తాజాగా అజిత్, విజయ్ అభిమానుల మధ్య వార్ శ్రుతిమించినట్లు కనిపిస్తోంది. విజయ్ చనిపోయాడని.. ‘బీస్ట్’ అతడి ఆఖరి సినిమా అంటూ అజిత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. RIPJosephVijay అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేస్తున్నారు. హీరో విజయ్ ఫొటోలను తమకు ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.

అయితే ఈ తతంగం మొదలైంది విజయ్ అభిమానులతోనే. అంతకుముందు విజయ్ అభిమానులు అజిత్‌ను టార్గెట్ చేసుకుని కొన్ని పోస్టులు చేశారు. అజిత్ ఎయిడ్స్ పేషెంట్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తట్టుకోలేక ఏకంగా విజయ్ చనిపోయాడని అజిత్ అభిమానులు ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. కొందరు అజిత్ ఫ్యాన్స్ స్వయంగా అజిత్‌కు ఇలానే పనులు నచ్చవని.. మీరు నిజమైన అజిత్ అభిమానులు అయితే ఈ ట్రోలింగ్ ఆపాలంటూ హితవు పలుకుతున్నారు. చూడాలి వీరి మధ్య వార్ ఎంత దూరం వెళ్తుందో మరి.

Exit mobile version