సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్ల అందమే ఎక్కువగా మాట్లాడుతుంది. నిత్యం జిమ్ లు, వర్క్ అవుట్లు, కడుపు మాడ్చుకొని డైట్లు చేస్తే తప్ప పర్ఫెక్ట్ ఫిగర్ కనిపించదు. ఇక దినంతో పాటు హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఉన్న ఏకైక మార్గం సర్జరీ. ముక్కు బాలేదని, పెదాలు పెద్దగా ఉన్నాయని, బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఇలా చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకొని అందాన్ని కొనితెచ్చుకున్నవాళ్లే. తాజాగా అదే లిస్ట్ లో యాడ్ అయ్యాను అని అంటోంది హీరోయిన్ హెబ్బా పటేల్. కుమార్ 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారుకు చెమటలు పట్టించిన ఈ భామ ఈ సినిమా తరువాత అంతటి హిట్ ని అందుకోలేదంటే అతిశయోక్తి కాదు.
ఇక అడపాదడపా కుర్ర హీరోల సినిమాలో గెస్ట్ గా కనిపిస్తున్న ఈ భామ ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే రామ్ కార్తీక్ సరసన తెలిసినవాళ్ళు అనే మూవీ చేస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఇక ఈ సెషన్ లో ఓ అభిమాని .. మీ అందానికి రహస్యం ఏంటి అని అడగగా.. హెబ్బా చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ” అదొక పెద్ద సీక్రెట్.. ఇపొపటివరకు ఎవరికి రివీల్ చేయకూడదు అనుకున్నా.. కానీ, మీరు అడుగుతుంటే చెప్పాలనిపిస్తుంది… నా అందం దేవుడు కొంత ఇచ్చింది.. మిగతాది డాక్టర్ల కృషి” అంటూ సర్జరీల విషయాన్ని బయటపెట్టింది. సర్జరీల వలనే తాను అంత అందంగా ఉన్నానని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం హెబ్బా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
