ఒకప్పుడు టెలివిజన్ చరిత్రలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అమృతం’ సీరియల్‌లో అమృతంగా కొన్ని ఎపిసోడ్స్ లో నటించిన హర్షవర్ధన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి హర్షవర్ధన్, ప్రస్తుతానికి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూనే, అడపాదడపా రచయితగా, దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆయన మణికంఠ వరప్రసాద్ గారి సినిమాలో నారాయణ అనే క్యారెక్టర్ లో మెరిశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వరుసగా ఆయనను పలు ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.
Also Read:Shruti Haasan: హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి?
ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఫిజికల్ రిలేషన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి హర్షవర్ధన్ పెళ్లి చేసుకోనని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో యాంకర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సమయంలోనే హర్షవర్ధన్ మాట్లాడుతూ.. “పెళ్ళికి, ప్రేమకు లింక్ పెట్టకూడదు” అని చెప్పుకొచ్చారు. పెళ్లి రిలేషన్ లో దొరికేవన్నీ ప్రేమలోనూ దొరుకుతాయి, కానీ ప్రేమలో దొరికేవన్నీ పెళ్ళిలో దొరకకపోవచ్చు అంటూ తన వర్షన్ చెప్పుకొచ్చాడు.
Also Read:Spirit : థియేటర్ కలెక్షన్లతో పనిలేదు.. ఓటీటీతోనే సేఫ్: ‘స్పిరిట్’ బాక్సాఫీస్ అరాచకం షురూ!
తన వరకు ఇప్పటికీ సుమారు వంద మందికి పైగా అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ ఉందని, తాను వారందరినీ గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. తాను కేవలం వారితో ఫిజికల్ రిలేషన్ కోసమే ఉండనని, ఒక స్త్రీగా వారిని ఎంతో గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాక, ఎంత మంది అనేది ఒక నంబర్ కూడా తాను చెప్పనని, ఎందుకంటే తనకు స్త్రీలు అంటే గౌరవమని అన్నాడు. వాళ్ళని ఒక నంబర్ కి పరిమితం చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన కామెంట్స్ చేశారు.
