NTV Telugu Site icon

Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి

Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena

Harish Shankar DVV Danayya BVSN Prasad Visits Janasena Party Office: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖులు సందడి చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్‌, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు విచ్చేశారు. పవన్ చేపట్టిన యాగంలో పాల్గొన్న దేవీ దవతలను వీళ్లు దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత.. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, షూటింగులు చేయాలనే అంశంపై పవన్‌తో వాళ్లు చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇదే సమయంలో.. దర్శకనిర్మాతలు కొన్ని లొకేషన్లను కూడా పరిశీలించారు.

Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?

ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. జూన్ 14వ తేదీ నుంచి వారాహి యాత్ర చేపడుతున్న పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక పరివర్తన, లోకకళ్యాణం కోసం పవన్ చండీ హోమం జరిపారని.. తాము దైవదర్శనం కోసం వచ్చామని అన్నారు. తామంతా తొలిసారి మంగళగిరికి వచ్చామన్నారు. ఈ ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని.. పవన్ కళ్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను కూడా ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. ఆల్రెడీ రాజమండ్రి, వైజాగ్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతున్నాయని.. ఇకపై బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లోనూ షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడామని వెల్లడించారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయన్నారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్నీ జరిగేది ఇక అక్కడేనా..?

అనంతరం డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. జూన్ 14 నుంచి వారాహి యాత్ర చేపడుతుండటంతో పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయంలో చండీహోమం చేపట్టారని, ఈ సందర్భంగా తాము దైవదర్శనం చేసుకోవడానికి వచ్చామని చెప్పారు. హరీశ్ శంకర్ చెప్పినట్టు.. తాము ఏపీలోని మంగళగిరి, బెజవాడ ప్రాంతాల్లో రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని.. తాము చెప్పాల్సిందంతా హరీశ్ శంకర్ చెప్పారని అన్నారు. కాగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే!

Show comments