Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు ‘ప్రతాప్’ అనే పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. అది తిరువీర్ నటనకు నిదర్శనం. దర్శకుడు నరేష్‌కు తెలుగు భాషపై, కథపై ఉన్న పట్టు ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. ఆయన ప్యాషన్ చూస్తుంటే సినిమాపై నమ్మకం పెరుగుతోంది” అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. “నేను ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం ఈవీవీ సత్యనారాయణ గారు. ఆయన సినిమాలు చూడకపోతే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాదు. అల్లరి నరేష్ గారిని ఎప్పుడు కలిసినా నాకు ఆయన తండ్రి గారే గుర్తొస్తారు” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
వేడుకలో థీమ్ ప్రకారం యాంకర్ స్రవంతి అందరినీ ‘పాపం’ అని సంబోధిస్తుండటంతో హరీష్ శంకర్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. “స్రవంతి నన్ను ‘పాపం హరీష్ గారు’ అన్నప్పుడు.. బహుశా ఆమె నా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ గురించి అలా అంటోందేమో అని ఒక్క క్షణం భయపడ్డాను (నవ్వుతూ). కానీ తర్వాత తెలిసింది ఆమె అందరినీ అలాగే పిలుస్తోందని” అంటూ చమత్కరించారు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!