Harinath Special: ఆనాటి అందాల నటుడు హరనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో ఎందరో ‘అందాలనటుడు’ అన్న మాటను తమ ముందు చేర్చుకున్నవారు ఉన్నారు. ‘అందాలనటుడు’ అనగానే చప్పున మనకు గుర్తుకు వచ్చేది యన్టీఆర్, శోభన్ బాబు, ఆ తరువాత హరనాథ్. ఈ ముగ్గురూ కలసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. దక్షిణాదిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరు యన్టీఆర్. ఆయన ఇతర పాత్రలు పోషించిన పౌరాణికాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ వంటి పాత్రలను కాంతారావు, హరనాథ్ తోనే నటింప చేశారు. అలా ఆ రోజుల్లో హరనాథ్ ‘అందాలనటుడు’గా అలరించారు.
హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరనాథరాజు. 1936 సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో ఆయన జన్మించారు. తరువాత వారి పెద్దలు మద్రాసులో ఉండడంతో పి.యు.సి. దాకా అక్కడే చదివారు. కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో బి.ఏ., పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు. పలు నాటకాల్లో నటించి ఆకట్టుకున్నారు. పైలట్ కావాలని ఆశించారు హరనాథ్. అయితే అనుకోకుండా ఓ సారి హరనాథ్ ను నటదర్శకుడు ముక్కామల చూడడం తటస్థించింది. ఆయన తన ‘ఋష్యశృంగ’ చిత్రంలో కథానాయకునిగా హరనాథ్ ను ఎంచుకున్నారు. తరువాత జమునతో కలసి ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రంలో నటించారు హరనాథ్. ఈ రెండో చిత్రమే ముందుగా విడుదలయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో హరనాథ్ కు హీరోగా గుర్తింపు లభించింది.
యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తనకు లభించిన పాత్రల్లో నటించి మరింత పేరు సంపాదించారు హరనాథ్.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘సీతారామకళ్యాణం’లో శ్రీరాముని పాత్రలో హరనాథ్ ను నటింప చేశారు. అదే చిత్రంలో లక్ష్మణునిగా శోభన్ బాబును ఎన్నుకున్నారు. ఆ సినిమా విజయంతో హరనాథ్ కు పౌరాణిక పాత్రలూ లభించసాగాయి. యన్టీఆర్ ‘భీష్మ’లో హరనాథ్ శ్రీకృష్ణునిగా, శోభన్ బాబు అర్జునునిగా నటించారు. ఈ చిత్రం సైతం వారికి మంచి పేరు తెచ్చింది. యన్టీఆర్ హీరోగా రూపొందిన “కలసివుంటే కలదు సుఖం, ఆత్మబంధువు, పెంపుడు కూతురు, పాండవవనవాసము, నాదీ ఆడజన్మే, పల్నాటియుద్ధం, పుణ్యవతి, ఆడపడచు, చిట్టిచెల్లెలు” వంటి చిత్రాలలో హరనాథ్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఏయన్నార్ తో హరనాథ్ కలసి “రుణానుబంధం, అమరశిల్పి జక్కన్న, రహస్యం” చిత్రాలలో నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన ‘గుండమ్మకథ’లో హరనాథ్, జమున అన్నయ్యగా నటించారు. కానీ, కొందరు ఆ ఇద్దరు మహానటులు హరనాథ్ ను ఎదగకుండా తొక్కేశారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటివారికి ఈ చిత్రాలే జవాబు అని చెప్పవచ్చు.
హరనాథ్ ‘భక్త ప్రహ్లాద’ తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లోనూ విష్ణు పాత్రలో నటించడం విశేషం! ‘శ్రీరామకథ’లో శ్రీరామునినూ, ‘భీమాంజనేయ యుద్ధం’లో శ్రీకృష్ణునిగానూ, ‘పాండవవనవాసము’లో అభిమన్యునిగానూ, ‘రహస్యం’, ‘బాలభారతం’ చిత్రాలలో నారదునిగానూ హరనాథ్ అభినయించి ఆకట్టుకున్నారు.
హరనాథ్ హిట్ పెయిర్ జమున అనే చెప్పాలి. నిజానికి హరనాథ్, జమున ఒకే వయసు వారు. ఇద్దరూ 1936లోనే జన్మించారు. ఆమె హరనాథ్ కంటే మూడు రోజులు పెద్దది. వారిద్దరూ తొలిసారి నటించిన ‘మా ఇంటి మహాలక్ష్మి’ ఆదరణ పొందగా, ఆ తరువాత ‘లేతమనసులు’ సూపర్ హిట్ గా నిలచింది. “నాదీ ఆడజన్మే, పల్నాటియుద్ధం, పెళ్ళిరోజు, ఆడజన్మ, మా ఇంటి దేవత” వంటి చిత్రాలలో హరనాథ్ – జమున జోడీ అలరించింది. తరువాతి రోజుల్లో హరనాథ్ తాగుడుకు బానిసై తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నారు. ఆపై కొన్ని చిత్రాలలో గెస్ట్ రోల్స్ లో నటించారు. కానీ, అవేవీ ఆయనకు అంతగా గుర్తింపు సంపాదించ లేకపోయాయి. 53 ఏళ్ళ వయసులోనే 1989 నవంబర్ 1న హరనాథ్ కన్నుమూశారు. ఆయన తనయుడు బి.శ్రీనివాసరాజు నిర్మాతగా సాగారు. “గోకులంలో సీత, రాఘవేంద్ర, మా అశోక్ గాడి లవ్ స్టోరీ” వంటి చిత్రాలను శ్రీనివాసరాజు నిర్మించారు. ఏది ఏమైనా తెలుగునాట ‘అందాల నటులు’ అన్న ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా హరనాథ్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుం
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!