పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈ రోజు రాత్రి 9.30 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. బ్రో తర్వాత పవర్ స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Also Read : HHVM : వీరమల్లు ఓవర్శీస్ ప్రింట్లు అప్లోడ్ ఫినిష్.. కానీ టెన్షన్ తప్పదు
మరోవైపు సినిమా రిలీజ్ కాకుండా పవర్ స్టార్ రికార్డుల వేట మొదలు పెట్టాడు. ముఖ్యంగా ఆంధ్రలోని గోదావరి జిల్లాల్లో పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో 49 సెంటర్స్ కు గాను 47 సెంటర్స్ లో 107 షోస్ ను ప్రీమియర్ ప్రదర్శిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రీమియర్స్ వేయడం జిల్లాలోనే ఆల్ టైమ్ రికార్డు. ప్రీమియర్స్ కూడా దాదాపు సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక ఉత్తరాంధ్రలోను 116 పైగా షోస్ కన్ఫర్మ్ అయ్యాయి. ప్రీమియర్స్ తోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టనుంది హరిహర విరమల్లు. ఉత్తరాంధ్ర, కోనసీమ ఏరియాలలో ప్రీమియర్స్ షో టికెట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600 పెట్టినా డిమాండ్ పెరగండంతో బ్లాక్ లో వెయ్యి రూపాయలకు పైగా పలుకుతోంది. రిలీజ్ కు ముందే రికార్డ్ లు వేట మొదలు పెట్టిన పవర్ స్టార్ సినిమా ఇక టాక్ బాగుంటే మాత్రం గత సినిమాలు రికార్డ్స్ ను బద్దలు కొట్టిన ఆశ్చర్యం లేదు.
