పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా సెట్ లో శ్రీరామనవమి వేడుకలు జరిగిన విషయం విదితమే.
ఇక తాజాగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోస్టర్ లో పవన్ లుక్ ఆకట్టుకుంటుంది. గంభీరమైన చూపుతో శత్రువుల మీదకు దూకుతున్న సింహంలా పవన్ కనిపించాడు. . ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొదటిసారి పవన్ భారీ బడ్జెట్ తో పాటు పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
