NTV Telugu Site icon

Harihara Veera Mallu: క్రిష్ తప్పుకున్నాడంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన టీం

Hariharaviramallu

Hariharaviramallu

Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. సినిమా యూనిట్ కూడా సరిగా స్పందించకపోవడంతో అది నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది.

Kumari Aunty: మొన్న అక్కడ.. ఇప్పుడు ఇక్కడ.. ఇక నెక్స్ట్ బిగ్ బాసే..?

దాని ప్రకారం పవన్ కళ్యాణ్ అభిమానులు, సినిమా ప్రేమికులు తమ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన హై ఎండ్ విఎఫ్ఎక్స్ వర్క్ ప్రస్తుతానికి ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో జరుగుతోందని యూనిట్ పేర్కొంది. కచ్చితంగా మీ అంచనాలను దాటి ఉండేలాగా ఈ సినిమాని రూపొందిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ త్రిల్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండమని పేర్కొంది. ఇక అంతేకాక ఒక స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నామని దానికి కూడా సిద్ధంగా ఉండమని యూనిట్ పేర్కొంది. అయితే ఇక్కడ క్రిష్ పేరు కానీ ఆయన తప్పుకుంటున్నట్లు కానీ మెన్షన్ చేయలేదు కానీ సినిమా యూనిట్ చేసిన ట్వీట్లో క్రిష్ ట్విట్టర్ అకౌంట్ కూడా ట్యాగ్ చేయడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోలేదు అనే సంకేతం పంపినట్టు అవుతోంది.

Show comments