Site icon NTV Telugu

HHVM : వీరమల్లు థియేటర్లలోకి వచ్చేది ఆ నెలలోనే..?

Hhvm

Hhvm

HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న సమచారం ప్రకారం.. ఈ మూవీని జూన్ 12న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పాక్-ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also : JVAS : జగదేక వీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

వాటిపై పవన్ కల్యాణ్‌ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ప్రెస్ మీట్లు పెట్టి ఆర్మీకి మద్దతు తెలుపుతూనే.. ఇంకోవైపు పార్టీ తరఫున ఆర్మీ కోసం పూజలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారంట. అందుకే జూన్ రెండో వారానికి పోస్టు పోన్ చేసినట్టు సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీని కూడా మే 30న కాకుండా జులై నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో అండర్ వాటర్ సీన్లు..?

Exit mobile version