Site icon NTV Telugu

HHVM : అఫీషియల్.. వీరమల్లు ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్..

Hhvm (3)

Hhvm (3)

HHVM : హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. పవన్ కల్యాణ్‌ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మూవీ ప్రీమియర్స్ షోలు పెద్ద ఎత్తున వేస్తున్నారు. భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. దీంతో కలెక్షన్లు మొదటి రోజే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మూవీ గురించి మరో విషయం అధికారికంగా ప్రకటించారు. ప్రీమియర్స్ షోలో స్క్రీన్ మీద ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ను ప్రకటించేశారు. అమేజాన్ లో మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

Read Also : HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..

అయితే ఏ డేట్ అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రీమియర్స్ తర్వాత మూవీ రివ్యూలు బయటకు రాబోతున్నాయి. పవన్ కల్యాణ్‌ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ.. అలాగే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగామా ఉంది. పుష్ప-2 మూవీ ఘటన తర్వాత తెలంగాణలో మొదటిసారి ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఎన్నడూ లేనంతగా ప్రమోషన్లు కూడా చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి యాక్షన్ సీన్లు చేసినట్టు ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజుల్లోనే మూవీకి కావాల్సినంత ప్రమోషన్లు చేసి హైప్ పెంచేశారు పవన్ కల్యాణ్‌.

Exit mobile version