విలక్షణ నటుడు … శివాజీ రాజా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 26న శివాజీరాజా పుట్టినరోజు)
విలక్షణమైన నటనకు సలక్షణమైన రూపం శివాజీ రాజా అని చెప్పవచ్చు. చిత్రసీమను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము కాదని సామెత! అలా సినిమా రంగాన్ని నమ్ముకొని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించిన వారిలో శివాజీ రాజా పేరు కూడా చోటు చేసుకుంది. వందలాది చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారాయన. నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారాయన.
శివాజీ రాజా 1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి జి.రామరాజు, తల్లి చంద్రావతి. చదువుకొనే రోజుల్లోనే శివాజీరాజా సినిమా హీరోలను అనుకరిస్తూ నటించి, చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకొనేవారు. అతనిలోని చలాకీ తనం గమనించిన మిత్రులు ప్రోత్సహించారు. చెన్నపట్టణం చేరి సినిమా అవకాశాల కోసం పలు పాట్లు పడ్డారు శివాజీరాజా. బాలకృష్ణ ‘సీతారామకళ్యాణం’ వంటి చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ రఘు మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ‘కళ్ళు’ చిత్రం శివాజీరాజాకు మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ తరువాత నుంచి పలు చిత్రాలలో కీలక పాత్రల్లో అలరిస్తూ వచ్చారు రాజా.
Also Read
శివాజీరాజా హీరోగా ‘అహో బ్రహ్మ – ఓహో శిష్యా’ ‘మొగుడ్స్ అండ్ పెళ్ళామ్స్’వంటి సినిమాలు రూపొందాయి. బుల్లితెరపై కూడా శివాజీరాజా అలరించారు. ఆయన నటించిన “అమృతం” సీరియల్ విశేషాదరణ చూరగొంది. “మొగుడ్స్ – పెళ్ళామ్స్” టీవీ షోలోనూ ఆకట్టుకున్నారు. “శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, సంబరాల రాంబాబు, నాలో సగం, మిస్టర్ రోమియో” వంటి సీరియల్స్ లోనూ శివాజీరాజా తనదైన బాణీ పలికించారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ శివాజీరాజా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు విజయ్ కూడా నటునిగా రాణిస్తున్నాడు. ‘వేయి శుభములు కలుగు నీకు’ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ ఫిబ్రవరి 26తో శివాజీరాజా షష్టి పూర్తి చేసుకుంటున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!