అభినేత్రి… అదితీరావ్ హైదరీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(అక్టోబర్ 28న అదితీరావ్ హైదరీ బర్త్ డే)
పాలరాతి బొమ్మలా నాజూకు షోకులతో ఊరిస్తూంటుంది అదితీరావ్ హైదరీ. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించారామె. అదితీరావ్ సంప్రదాయ నృత్యదుస్తుల్లో నర్తిస్తూంటే నటి శోభన నృత్యం గుర్తుకు రాకమానదు. బ్రిటిష్ పాలనలో రాచరికం చూసిన రెండు కుటుంబాల కు చెందిన రక్తం అదితీరావ్ హైదరీలో ఉంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటూ సాగుతున్న అదితీరావ్ హైదరీ తెలుగువారినీ తన అభినయంతో ఆకట్టుకుంది.
అదితీరావ్ హైదరీ 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో జన్మించింది. ఆమె తండ్రి ఎహ్ సాన్ హైదరీ, తల్లి విద్యారావ్. తండ్రివైపు తాత అక్బర్ హైదరీ బ్రిటిష్ పాలనలో హైదరాబాద్ కు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇక తల్లివైపు తాత రామేశ్వరరావ్ వనపర్తి సంస్థానాధీశునిగా ఉన్నారు. అదితి రెండేళ్ళ ప్రాయంలోనే కన్నవారు విడిపోయారు. తల్లి ఢిల్లీ చేరి, అక్కడే తన కూతురును పెంచి పెద్ద చేసింది. అదితి తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నారు. పిల్లలు లేరు. ఆయన 2013లో కన్నుమూశారు. హైదరీకి రచయిత్రి, దర్శకురాలు, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ కూడా బంధువే. హైదరీ చిన్నతనంలోనే నాట్యంపై ఆసక్తి పెంచుకుంది. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక, లీలా శాంసన్ తో కలసి పలు నృత్యప్రదర్శనలు ఇచ్చింది. ఆమె రూపు రేఖలు, నృత్యం అచ్చు శోభనను తలపించడంతో సినిమా అవకాశాలు పలకరించాయి. మమ్ముట్టి నటించిన ‘ప్రజాపతి’ మళయాళ చిత్రంలో తొలిసారి అదితీరావ్ నటించింది. తరువాత తమిళ సినిమా ‘శృంగారం’లో దేవదాసీ పాత్రలో అభినయించింది. ‘ఢిల్లీ 6’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయింది. తన కజిన్ కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘ధోబీ ఘాట్’లోనూ కీలక పాత్ర పోషించింది. ‘యే సాలీ జిందగీ’ చిత్రంలో అదితీరావ్ అభినయం ఆకట్టుకుంది. ‘రాక్ స్టార్’లోనూ ఓ కీ రోల్ లో కనిపించింది.
Also Read
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
- Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
- King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
మణిరత్నం తెరకెక్కించిన ‘కాట్రు వెలియిదై’ చిత్రంలో కార్తీ సరసన నాయికగా నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘చెలియా’గా అనువాదమైంది. ఆ తరువాత మణిరత్నం తెలుగు అనువాద చిత్రం ‘నవాబ్’లోనూ అదితి నటించింది. ఈ రెండు సినిమాల తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘సమ్మోహనం’తో తెలుగు సినిమా రంగానికి పరిచయమయింది అదితి. ఆపై ‘అంతరిక్షం 9000 కెఎమ్.పిహెచ్.’లోనూ నటించింది. మోహన్ కృష్ణ తెరకెక్కించిన మరో చిత్రం ‘వి’లో నాని జోడీగా అలరించింది. ‘మహాసముద్రం’ తెలుగు చిత్రంలోనూ నాయికగా నటించింది. దుల్కర్ సల్మాన్ తో ‘హే సినామిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. మూడున్నర పదుల వయసులో మునుముందు అదితీరావ్ అభినయం ఏ తీరున అలరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!