Site icon NTV Telugu

HBD Sanjosh: హీరో సంజోష్ కొత్త చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్

Happy Birthday Sanjosh

Happy Birthday Sanjosh

Sanjosh First Look Released: కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం. 2గా హీరో సంజోష్ తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నిజానికి రమేష్ చెప్పాల డైరెక్షన్లో తెరకెక్కిన బేవర్స్ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సంజోష్. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఆ చిత్రంలో సంజోష్ తన నటనతో అందరినీ మెప్పించాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన హీరోగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం సంజోష్ కౌముది సినిమాస్, కేన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 2గా చంద్ర నిర్మిస్తోన్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

Narne Nithin: గీతా ఆర్ట్స్ 2లో ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా ప్రకటన.. కానీ ఆ విషయంలో షాకిచ్చారే!

ఇక మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా చంద్ర వ్యవహరిస్తున్నారు. ఇక హీరో సంజోష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో హీరో సంజోష్ చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. పక్కింటి అబ్బాయిలా సహజంగా ఈ లుక్ లో కనిపిస్తున్నాడు సంజోష్ . కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే తెలుగులో అనేక హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

Exit mobile version