Site icon NTV Telugu

బర్త్ డే : హన్సిక గురించి ఆసక్తికర విషయాలు

Happy Birthday Hansika Motwani

మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే హీరోయిన్ గా హన్సిక అరంగ్రేటం మాత్రం తెలుగులోనే జరిగింది. 2007లో అల్లు అర్జున్ సరసన “దేశముదురు” చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హన్సికను చూసి ఎంతోమంది ఫిదా అయిపోయారు. ఆ చిత్రం వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. అల్లు అర్జున్, హన్సిక కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండింది. ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే హన్సిక మాత్రం మొదటి చిత్రంతోనే హిట్ కొట్టి ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అగ్ర హీరోయిన్ గా మెరిసింది.

Read Also : పెళ్లికి ముందు కోలీవుడ్ యాక్ట్రస్ కోలాహలం!

హన్సిక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు విష్ణు, రామ్, తమిళంలో విజయ్, సూర్య, జయం రవి వంటి టాప్ సౌత్ ఇండస్ట్రీ నటులతో కలిసి పని చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే హన్సిక తండ్రి ఫ్యామిలీని ఆమె చిన్నప్పుడే విడిచి పెట్టారట. ఆమె తల్లి పిల్లలను ఒంటరిగా పెంచింది. ఈ కారణంగా హన్సిక తన తల్లికి చాలా దగ్గరగా ఉంటుంది. హన్సిక ఎక్కువగా రొమాంటిక్ పాత్రలు చేస్తుంది. హన్సిక అందం, నటనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు అభిమానులు హన్సిక విగ్రహంతో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఖుష్బూగా పిలుచుకునే ఈ అమ్మడు ఇప్పుడు తన 50వ చిత్రం “మహా”లో కనిపించబోతోంది.

Exit mobile version