బర్త్ డే : హన్సిక గురించి ఆసక్తికర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే హీరోయిన్ గా హన్సిక అరంగ్రేటం మాత్రం తెలుగులోనే జరిగింది. 2007లో అల్లు అర్జున్ సరసన “దేశముదురు” చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హన్సికను చూసి ఎంతోమంది ఫిదా అయిపోయారు. ఆ చిత్రం వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. అల్లు అర్జున్, హన్సిక కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండింది. ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే హన్సిక మాత్రం మొదటి చిత్రంతోనే హిట్ కొట్టి ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అగ్ర హీరోయిన్ గా మెరిసింది.
Read Also : పెళ్లికి ముందు కోలీవుడ్ యాక్ట్రస్ కోలాహలం!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
హన్సిక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు విష్ణు, రామ్, తమిళంలో విజయ్, సూర్య, జయం రవి వంటి టాప్ సౌత్ ఇండస్ట్రీ నటులతో కలిసి పని చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే హన్సిక తండ్రి ఫ్యామిలీని ఆమె చిన్నప్పుడే విడిచి పెట్టారట. ఆమె తల్లి పిల్లలను ఒంటరిగా పెంచింది. ఈ కారణంగా హన్సిక తన తల్లికి చాలా దగ్గరగా ఉంటుంది. హన్సిక ఎక్కువగా రొమాంటిక్ పాత్రలు చేస్తుంది. హన్సిక అందం, నటనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు అభిమానులు హన్సిక విగ్రహంతో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఖుష్బూగా పిలుచుకునే ఈ అమ్మడు ఇప్పుడు తన 50వ చిత్రం “మహా”లో కనిపించబోతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!