Site icon NTV Telugu

Hanuman Premieres: హను-మాన్ ఆ క్రేజ్ ఏందయ్యా?

Hanuman

Hanuman

Hanuman Premieres gets a Tremendous Response: హనుమాన్ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. పాన్-ఇండియన్ సినిమాగా వస్తున్న హనుమాన్ సినిమా ప్రేక్షకులలో ఊహించని క్రేజ్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్‌ ఉంది. హనుమాన్ ప్రీమియర్స్ అద్భుతమైన హిట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని మొదట లిమిటెడ్ షోస్ ప్రదర్శించాలని ప్లాన్ చేసి నిన్న సాయంత్రం వైజాగ్, హైదరాబాద్ లలో షోలు ఓపెన్ చేశారు. అద్భుతమైన డిమాండ్ కారణంగా , ఈ షోలను ఇంకా ఇంకా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ క్రమంలో టీమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల్లో, సీ అండ్ డీ సెంటర్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తోంది. అన్ని ప్రధాన నగరాల్లో హనుమాన్ షోలు సాయంత్రం 6:30 మరియు రాత్రి 9:30 గంటలకు ప్రదర్శించబడతాయి. జనవరి 11న సినిమాలేవీ విడుదల కానందున, సినిమా చాలా స్క్రీన్లు – షోలను దక్కించుకుంటోది. ఈ ప్రీమియర్ స్ట్రాటజీ నిర్మాతలు, కొనుగోలుదారులకు బాగా వర్కౌట్ అవుతోంది.

SS Thaman: ‘కుర్చీ మడత’ పెట్టాడని ‘థమన్’ని ఎన్ని తిట్టుకున్నారో పాపం!

ఇలా చేయడం మొదటి రోజు వసూళ్లను కవర్ చేస్తున్నట్టు అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం మొదటి రోజు స్క్రీన్ సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. AP/TGలో ఏ సినిమా కోసం ఇన్ని ప్రీమియర్ షోల సంఖ్యను ఎన్నడూ వినలేదు, మల్టీప్లెక్స్‌ల నుండి B, C సెంటర్‌ల వరకు ప్రీమియర్‌లు జనవరి 11న షెడ్యూల్ చేయబడ్డాయి. బుక్ మై షోలో ఇప్పటివరకు దాదాపు 250 షోలు ఓపెన్ అవగా అందులోకి 200+ షోలు ఇప్పటికే సోల్డౌట్‌లో ఉన్నాయి. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్‌దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. హనుమాన్ చిత్రంలో, తేజ సజ్జ హనుమంతుడి వలన అసాధారణ శక్తులను పొందే యువకుడి పాత్రను పోషించాడు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ వంటి పలు భాషల్లో హనుమాన్ విడుదల కానుంది.

Exit mobile version